AP Assembly Winter Sessions 2019 : AP CM Jagan On Disha Case || Oneindia Telugu

2019-12-09 1,525

Watch Winter Session of Andhra Pradesh Assembly News. AP CM Jagan speech on Disha case and he congratulated cm kcr and telangana police.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా మహిళల పైన అఘాయిత్యాలకు పాల్పడితే..సరైన ఆధారాలు చిక్కితే వారికి 21 రోజుల్లోనే ఉరిశిక్ష పడేలా చట్టం తీసుకువస్తున్నట్లుగా ప్రకటించారు.
మహిళా భద్రత మీద అసెంబ్లీలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. తెలంగాణలో జరిగిన దిశ ఘటన పైన సీఎం స్పందించారు.
దిశపైన అత్యాచారం చేసి..చంపేసిన ఆ నలుగురిని ఎన్ కౌంటర్ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి జగన హాట్సాఫ్ చెప్పారు. అదే విధంగా సంఘటన జరిగినప్పుడు స్పందించని మానవ హక్కుల సంఘం ఢిల్లీ నుండి హడావుడిగా వచ్చయి..విచారణ చేయటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇక, సోషల్ మీడియాలో మహిళల పైన అసభ్యకరంగా పోస్టులు పెట్టేవారి పైనా చర్యలు తీసుకుంటామని ఈ దిశగా కొత్త బిల్లును ఈ నెల 11న సభలో ప్రవేశ పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#OnionPrice
#AssemblyWinterSession2019
#cmkcr
#dishacase